ఈ మహా శివుని విగ్రహం ఎత్తు 58 అడుగులు నాట్యం చేస్తున్నట్లు కనబడే జటాజూటం తో చతుర్భుజాలతో వీరుడిలా గా కనిపించే ఈ మహా దేవుడి విగ్రహం. కేరళ లోని విళింజంలోని అళిమాల శివాలయ ప్రాంగణంలో ఉండే గంగాధరేశ్వరుడు విగ్రహం దేశంలోనే ఎత్తయిన శివుడి మూర్తిగా పేరు పొందింది ..అళిమాల బీచ్ ఒడ్డున కాంక్రీట్ తో ఈ విగ్రహాన్ని ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేసిన సి. ఎస్ దేవతారాధన తన 26 ఏళ్ల వయసులో చేయటం మొదలు పెట్టాడు. మొత్తం ఆరేళ్ల పాటు ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దాడు. సాగరతీరాన కొలువుదీరిన ఈశ్వరుని చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు అంటారు భక్తులు.

Leave a comment