లతా భగవాన్ కరే మరాఠీ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రంగా ప్రత్యేక ప్రస్తావన దక్కింది.ఇందులో నటించిన లతా భగవాన్ కరే ది ఇది తొలి సినిమా అలాగే ఆమె ఆత్మకథ కూడా లతా కరే మహారాష్ట్ర లోని చారామతి లో నివాసం ఉంటుంది ఆమె 60 ఏళ్ళ వయసులో భర్త భగవాన్ కు గుండె జబ్బు వచ్చింది. అప్పటికే ఆమె ముగ్గురి కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి సీనియర్ సిటిజెన్స్ మారథాన్ లో గెలుపు గెలిస్తే ఐదు వేల రూపాయల బహుమతి అని తెలుసుకుని లతా కరే పట్టుదలగా సాధన చేసి మారథాన్ లో  పాల్గొన్నది. తొమ్మిది గజాల చీర తో ఆమె పరువు తియ్యటం అందరూ ఆశ్చర్యంగా చూశారు ఆ మారథాన్ లో ఆమె గెలిచింది. ఏ కారణం చేత పోటీలో పాల్గొన్నారో తెలుసుకొని ఆమెకు పెద్ద ఎత్తున సాయం చేశారు. ఆమె కథను ఆమెతోనే సినిమాగా తీశారు కరీంనగర్ కు చెందిన నవీన్ దేశబోయినా,  అర్ర బోతు కృష్ణ లు. ఈ సినిమా కు జాతీయ అవార్డు దక్కింది.

Leave a comment