వంటింటి వైద్యంలో లవంగం నూనె చాలా  ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. టూత్ పేస్ట్ లలో మౌత్ వాషర్ల లో లవంగ నూనె వాడటానికి కరనం అందులో బాక్టీరియల్ గుణాలే, చిన్న పాటి గాయాలు, కాలి పగుళ్ళు, వేళ్ళ మధ్యలో ఇన్ ఫెక్షన్ సమస్యలన్నిటికీ లవంగం నూనె మంచి మందు అయితే ఈ నూనె నేరుగా రాస్తే కొంచెం మంటగా వుంటుంది కనుక కష్ట బాదాం నూనె కలుపుకోవచ్చు. లేదా భరించ గలిగే మంటే గనుక అలాగే అప్లయ్ చేయచ్చు. లవంగం నూనె లో ముంచిన దుది వాసనా చుస్తే వికారం తలనొప్పి సమస్య తగ్గిపోతుంది. పంటి నొప్పికి నోటిలో పుండ్లకీ లవంగం నూనె మంచి మందు. నూనెలో దుదిని తడిపి నొప్పి వున్న చోట రాస్తే ఉపసమనం కలుగుతుంది.

Leave a comment