లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ తో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. పొడి జుట్టు ను మెత్తగా, జిడ్డు జుట్టును పొడిగా  మారుస్తుంది. వెంట్రుకలు పొడవుగా ఆరోగ్యంగా పెరిగేలా తోడ్పడుతుంది. 10 చుక్కలు లావెండర్ నూనె ను 5 చుక్కల సెడర్ వుడ్ నూనె, ఐదు చుక్కలు కొబ్బరి నూనె, ఒక టీ స్పూన్ ఆముదం కలిపి మునివేళ్ళతో ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి మర్దన చేయాలి. రాత్రి అలా వదిలేసి ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లు బలపడి,పోషణ అంది జుట్టు వేగంగా పెరుగుతుంది. వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే చాలా కొద్ది నెలల్లో ఫలితం తెలుస్తుంది.

Leave a comment