చాలా సన్నగా వుండి కాస్త బొద్దుగా కనిపించాలనుకునే వాళ్ళకి పొరల డిజైన్స్ దుస్తులు బావుంటాయంటున్నారు ఎక్స్ పర్ట్స్ ఈ లేయర్స్ దుస్తులు సౌకర్యంగా కొత్తగా వుంటాయి కాస్త ఎత్తుగా వుండే పొట్టను దాటేస్తాయి. సిల్క్, షిఫాన్, జార్జెట్, రేయాన్ వంటి వస్త్రశ్రేణి లో ఈ లేయర్స్ డిజైన్ డ్రెస్ లు చక్కగా అమరికగా ఉంటాయి. ఇక ఈ లేయర్స్ టాప్ జీన్స్,  లెగ్గింగ్స్ కు జతగా బావుంటాయి ఈ పొరల డిజైన్స్ ను ఒక వరస తర్వాత ఇంకో వరస వచ్చేలా ప్రతి అంచుని ఇంకో రంగులో పైపింగ్ చేయించిన డ్రెస్ అయితే ఇంకా ఫ్యాషన్ గా వుంటుంది. ఈ పొరల  డిజైన్స్ మోకాలి వరకు వుండే గౌన్లకు అనార్కలీలకు కుడా చక్కగా ఉంటాయి. ఎలాంటి శరీరాకృతి కైనా ఇవి పర్ ఫెక్ట్ గా వుంటాయి.

Leave a comment