కాళ్ళని ఎంతో అందంగా చూపించే లెగ్గింగ్స్ అంటే అమ్మాయిలందరూ ఇష్టపడతారు. మోస్ట్ ఫ్యాషనబుల్ డ్రెస్ లో లెగ్గింగ్స్ ముందుంటాయి. మంచి పార్టీలకు, ఇంట్లో తేలిగ్గా తిరిగేందుకు ఈ లెగ్గింగ్స్ ని ఫ్రిఫర్ చేస్తున్నారు. కానీ ఇప్పుడో అధ్యయినం ఈ లెగ్గింగ్స్ అందం తో పాటు బరువునీ పెంచుతాయని చెపుతుంది. బిగుతుగా వుండే లెగ్గింగ్స్ వల్ల తొడలు, ఉదర భాగం పొత్తి కడుపు కండరాల్ల చలనం తగ్గిపోతుంది. ఫలితంగా అక్కడ కొవ్వు పెరుగుతుంది. వేసవిలో ఈ ప్రాబ్లమ్ మరీ ఎక్కువ అందుకే లెగ్గింగ్స్ కుసాధ్యమైనంత దూరంగావుండమంటున్నారు. లేదా లెగ్గింగ్స్ లేకుండా వుండమంటున్నారు. లేదా  లెగ్గింగ్స్ లేకుండా వుండ లేమంటారా. మంచి యోగా, వ్యాయామ నిపుణులను సంప్రదించి కొవ్వు పెరగకుండా చుసుకోమంటున్నారు. అధ్యయినం రిపోర్ట్ కరక్టే నంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్ కూడా.

Leave a comment