కొత్త స్టయిల్ తో ట్రెండ్ సృష్టించడం అంట తెలికేమీ కాదు. నిరంతరం ఆలోచనలోనే వుండాలి. ఆ వచ్చిన క్రియేటివ్ ఠీట్ అందరి మనసు దోచుకునేలా వుండాలి. నిమిష నిమిషం మారిపోయే ఫ్యాషన్ ప్రపంచంలో నిలబడాలంటే కొత్తదానం అన్వేషించాల్సిందే. హెయిర్ స్టయిలిస్ట్ ల పనీ అదే. సౌందర్యంలో ప్రధాన పాత్ర పోషించే జుట్టుకు చేయగల ఫ్యాషన్ ట్రెండ్ ని సృష్టించాలి. అలా ఇప్పుడు హాలో గ్రాఫిక్ ట్రెండ్ సృష్టించారు. జుట్టుకు లావెండర్, గులాబీ, నీలం రంగుల్లోని లేలేత ఛాయాలని కలిపి అమ్మాయిల హెయిర్ స్టయిల్ కి రెయిన్ బో అందాల్ని తెచ్చారు. ఇంద్రదనస్సు విరిసినట్లున్న ఈ అందమైన వర్ణాలు జుట్టుని మరింత అందంగా మార్చేసారు చూడండి.

Leave a comment