Categories
Nemalika

లేని మూడో మనిషి గురించి మాట్లాడటం తప్పే.

నీహారికా,

ఈ రోజుల్లో జాబ్ చేసే అమ్మాయిలు దాదాపు తొమ్మిది గంటల పాటు కార్యాలయాలలోనే గడుపుతున్నారు. కొన్ని చిన్ని మర్యాదలు పాటిస్తే, చుట్టూ వుండే కొలీగ్స్ తో స్నేహం నేరిపితే  ఆఫీసు, ఇల్లు అనే తేడా లేనంత కంఫర్ట్ గా ఉండొచ్చు. మొట్ట మొదటి విషయం  ఆఫీసు కు సంబందించి సోమరిగా ఉండకూడదు. ఇచ్చిన పని సంపూర్ణంగా,   సకాలంలో చేయాలి. అలాగే సహోద్యోగుల విషయంలో    ఎప్పుడు విభేదించకూడదు   విచక్షణ    పోగొట్టుకుని వ్యక్తి గతంగా దూషించ కుడదు.  అలాగే ఇతరులకు ఇచ్చింది కలిగించే ఫోన్లో  రింగ్ టోన్   వినబడేలా పెట్టుకోవడం, గట్టి గట్టి    గా ఆఫీసు ను డిస్ట్రబ్  చేసే విధంగా మాట్లాడటం  అస్సలు చేయకూడదు.  అలాగే ఇద్దరు  ముగ్గురు  మాట్లాడే   సమయంలో   అక్కడ లేని ముడో వ్యక్తి  గురించి  ప్రస్తావనలు,   మాటలు   కూడదు.    ఇది  అన్నింటి   కంటే అసభ్య కరమైన అంశం. వ్యక్తుల పరోక్షంలో వాళ్ళ గురించి కించ   పరిచే  మాటలు మాట్లాడ   కూడదు.   ఆఫీసు పరిసరాలు  చుట్టూ  పరి శుబ్రంగా    ఉండేలా అందరు ప్రయత్నం   చేయాలి.   టీ కప్పులు,  పేపర్లు తీసుకు పోయి   డస్ట్   బిన్ లో పడేస్తే వచ్చే  చిన్న  తనం ఏమీ  వుండదు.  ఇలాంటి  చిన్ని పాటి మర్యాదలు  ఏ మన చుట్టూ ఎప్పుడు  స్నేహితులే  వుంటారు.

 

Leave a comment