ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,అనంతపురం జిల్లాలోని హిందూపూరుకి 14 కి.మీ.దూరంలో లేపాక్షి కనబడుతుంది.
పూర్వ కథనం ప్రకారం రావణుడు సీతను అపహరించి తీసుకుని వెళ్ళుతున్న సమయంలో జటాయువు అడ్డుకునిన దాని రెక్కలు విరగగొట్టెను.జటాయువు చలనంలేని స్థితిలో పడిపోయింది. హనుమంతుడు శ్రీ రామచంద్రమూర్తి కి సీతాన్వేషణలో సహాయం చేస్తూ పడి వున్న జటాయువుని చూచి రాములవారు లే పక్షి  అని సంబోధిస్తారు. ఆ పదం రాను రాను లేపాక్షిగా ప్రసిద్ధి చెందింది.
ఈ ప్రదేశంలో  హనుమంతుని పాదముద్రలు కూడా దర్శనం ఇస్తాయి.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పులిహోర, గారెలు.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment