పిల్లలకు కరోనా రాదు అనుకున్నారు కానీ సెకండ్ వేవ్ ఆ అభిప్రాయం తప్పని నిరూపించింది .కరోనా కు పెద్ద చిన్న తేడా లేదని తేలిపోయింది. కరోనా కోరల్లోంచి బయటపడిన పిల్లలను ఇమ్యూనిటీ పెంచే ఆహారంఇవ్వాలంటున్నారు డాక్టర్లు. పిల్లల్లో రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేసేందుకు విటమిన్-డి ముఖ్యం ఉదయం పూట పిల్లల శరీరానికి ఎండ తగిలేలా చూడాలి. పుట్టగొడుగులు గుడ్డులోని పచ్చ సొన లో కూడా విటమిన్-డి దొరుకుతుంది. అరటి, బొప్పాయి, ఆపిల్, పుచ్చకాయ, ద్రాక్ష, బెర్రీలు ఇలా సీజనల్ ఫ్రూట్స్ పిల్లలకు తినిపించాలి. కరోనా సోకిన పిల్లలకు పండ్లే ఔషధం ఆప్రికాట్, ఖర్జూరాలు, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం, పిస్తా వంటి నట్స్ పిల్లలకు ప్రతిరోజు ఇవ్వాలి ఆరోగ్యకరమైన ప్రోటీన్లు కొవ్వులు వీటి ద్వారా శరీరానికి అందుతుంది. పిల్లల శరీరంలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందటానికి ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారం అవసరం.పప్పు దినుసులు, చేపలు, చికెన్, మటన్ వంటి వాటిలో ప్రోటీన్లు ఎక్కువ పాలు పెరుగు గుడ్లు లో కూడా ఇవి ఎక్కువే చిన్నపిల్లలకు కూడా మెత్తగా ఉడికించిన మాంసాహారం పెట్టవచ్చు పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగేందుకు బ్యాలెన్స్డ్ ఫుడ్  బాలెన్స్ డ్ ఫుడ్ ఇవ్వాలి ఆహారం సమతులంగా ఉండేలా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పాలు, గుడ్లు, మాంసం గింజలు, పప్పుధాన్యాలు అన్ని కలిపితేనే అది సమతులాహారం పిల్లలు తినే ఆహారంలో ఇవన్నీ ఉంటేనే ఆరోగ్యం.

Leave a comment