శరీరంలో కొవ్వును శక్తిగా మార్చడంలో లైపో ప్రోటీన్ , లైపేజ్ అనే ఎంజైమ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు కదలకుండా కూర్చుంటే కండరాళ్ళ సంకుచ ప్రక్రియ తగ్గుతుంది.  ఈ ఎంజైమ్ పని సమాధ్యం తగ్గిపోతుంది. అప్పుడు శరీరంలో కొవ్వు కరగకుండా పోతుంది. ఎక్కువ సేపు కూర్చుంటే పురుషులతో పోలిస్తే మహిళలకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు వచ్చే ముప్పు ఎక్కువని పరిశోధనలు చెప్పుతున్నాయి. ఈ కాలంలో ఎక్కువ సేపు కుర్చుని చేసే ఉద్యోగాలే. దీర్ఘకాలం మెడ వెన్నుముక్క కండరాళ్ళ బలహీన పడతాయి. పిరుదులు, ఆ పై భాగాన వత్తిడి పెరిగి నడక మందగిస్తుంది. ఇప్పుడిక క్రీడలు, ఫిట్నెస్ పైన ద్రుష్టి పెట్టక పొతే శాశ్వతంగా అనారోగ్యాలకు గురవ్వుతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Leave a comment