బాలీవుడ్ లో అగ్రశ్రేణి స్టంట్ ఉమెన్ గీతా టండన్ చిన్న వయసులోనే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లల తల్లి అయిన గీత భర్త వేధింపులు తట్టుకోలేక ఇల్లు వదిలి పిల్లలతో బయటకు వచ్చేసింది. ఉపాధి మార్గంగా సినిమాల్లో గ్రూప్ డాన్సర్ పని ఎంచుకుంది. యాక్షన్ స్టంట్స్ లో మరిన్ని అవకాశాలు ఉంటాయని తెలిశాక అటువైపుగా ప్రయత్నాలు మొదలు  పెట్టింది గీత . ఈ వృత్తిలో చాలా సవాళ్లు ఉంటాయి కేబుల్ వైర్ల పైనా వేలాడటం, ఎత్తైన భవనాల నుంచి దూకటం, కదులుతున్న కారులో నుంచి దూకటం, నిప్పుల్లోంచి దూసుకు రావటం వంటి భారీ ప్రమాదకర విన్యాసాలు ఉంటాయి చాలా కష్టపడి ఈ స్టంట్స్ లో ప్రావీణ్యం సంపాదించింది గీతా టండన్ గుర్తింపు వచ్చాక పెద్ద హీరోయిన్ లతో పనిచేసే అవకాశాలు చాలా వచ్చాయి చెన్నై ఎక్స్ ప్రెస్ లో దీపిక పడుకొనే, ఉడ్తా పంజాబ్ లో కరీనా కపూర్ తో పనిచేశాక మంచి గుర్తింపు వచ్చింది. హిందీ సినిమా సింఘంతో అవకాశాలు ఎక్కువయ్యాయి, బాలీవుడ్ లో ఎక్కువమంది ప్రిఫర్ చేసే స్టంట్ ఉమెన్ గా ఆమెకు గుర్తింపు వచ్చింది. కొన్ని స్టంట్స్ పురుషులే చేయగలరని అనుకొంటారు కానీ మహిళలు ఎవరైనా చేయగలరని నిరూపించింది గీత టాండన్ ఆమెది స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. స్టంట్ ఉమెన్ కెరీర్ రిస్క్,కానీ జీవితం అంతకంటే రిస్క్. భయపెట్టేది కూడా జీవిత పోరాటం కంటే సినిమా స్టంట్ చాలా చిన్నది అంటుంది గీతా టండన్.

Leave a comment