ఎంత పనిచేస్తే ఎంతగా అలసిపోతే అంత ఆరోగ్యం అనుకొంటారు చాలామంది . కానీ  ఓహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అభిప్రాయం తప్పంటున్నారు ముఖ్యంగా మహిళలు ఎక్కువగా పనిచేస్తే అది వారి ఆరోగ్యంపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అంటున్నారు . కొన్ని సార్లు ప్రాణాంతక మైన వ్యాధులు భారినపడే అవకాశం ఉందంటున్నారు . వారంలో 40 గంటల చొప్పున 30 సంవత్సరాలకు పైగా పని చేసే మహిళల ఆరోగ్య స్థితి పై చేసిన అధ్యయనంలో శక్తికి మించిన పనిచేసిన వాళ్ళు ,నిరంతరం టెన్షన్ తో పనివత్తిడి కి సంబందించిన ఉద్రేకాలతో సతమతం అవుతూ గుండె జబ్బులు ,మధుమేహం కేన్సర్ వంటివి జబ్బుల భారిన పడే అవకాశం ఎంతో ఉందంటున్నారు . మహిళలకు  రోజులో ఎనిమిది,పది గంటలు విశ్రాంతి అవసరం అంటున్నారు .

Leave a comment