జుట్టు పొడిబారి చివర్లు చిట్లి పోతు,వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలు వస్తే ఈ సహజమైన పదార్థాల మందుల కంటే బాగా పనిచేస్తాయి అంటున్నారు వైద్యులు.రెండు కప్పుల మునగాకు రుబ్బుకుని దానికి టేబుల్ స్పూన్ ఆముదం చెంచా పెరుగు కలిపి తలకు పూతలా వేసుకోవాలి.20 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే దీనివల్ల కుదుళ్లు ఆరోగ్యం గా మారి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.అలాగే కలబంద గుజ్జు రాసి ఆరేవరకు జుట్టును అలా వదిలేసి తలస్నానం చేస్తే శిరోజాలు మెరిసిపోతాయి.మెత్తగా కుచ్చులా ఉంటాయి అలాగే బొప్పాయి గుజ్జు లో నానబెట్టి రుబ్బిన మెంతిపిండి కలిపి ఆ మిశ్రమంతో ప్యాక్ వేసుకుంటే జుట్టు ఊడిపోకుండా చిట్లిపోకుండా ఉంటుంది.

Leave a comment