ముఖ చర్మం కాంతిగా వుండాలంటే ఇంట్లో వుండే వస్తువులతో కొన్ని చిట్కాలు పాటించ వచ్చు . పసుపు ,రోజ్ వాటర్ ,కుంకుమ పువ్వు రేక ,గందపు చెక్కపొడి ,తేనె ఇవన్ని కలిపిన మిశ్రమం ముఖానికి రాసి ముని వేళ్ళతో మర్దన చేయాలి. ఐదు నిముషాలు ఆర నిచ్చి తర్వాత నీళ్ళతో కడిగేయాలి. మరిగే నీళ్ళలో ఎదో ఒక సుగందనూనె వేసి ముఖాన్ని ఆవిరిపై ఉంచి మందపాటి టవల్ కాపుకోవాలి ముఖం ఆవిరితో చమట్లు పట్టేస్తుంది. శుభ్రమైన క్లాత్ తో తుడుచుకుంటే చర్మం శుభ్రంగా కనిపిస్తుంది. ఇక అరటిపండు గుజ్జు,తేనె కలిపిన మాస్క్ వేసి పది నిముషాల తర్వాత కడిగేస్తే చర్మం చక్కగ మెరిసి పోతు కనిపిస్తుంది.

Leave a comment