ముఖంలో మనస్సు  ప్రతిబింబిస్తుంది అంటారు. ముఖం బావుంటే మనసు బాగున్నట్లే . ఇంత ప్రాధాన్యత ఉన్న ముఖ సౌందర్యం కోసం ప్రతిరోజు కొన్ని నిమిషాలు కేటాయించమంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఐరన్, పొటాషియం, క్యాల్షియం, సెలీనియం, జింక్, కాపర్, విటమిన్-ఎ, పోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే కుంకుమ పువ్వు తో ముఖానికి చక్కని కాంతి వస్తుంది. ఒక గిన్నెలో కాసిన్ని నీళ్ల లలో కుంకుమపువ్వు నాననిచ్చి ఉదయాన్నే ఆ కుంకుమ పువ్వు రేకల్లో ఓ స్పూన్  పాలు కొద్దిగా పంచదార రెండు మూడు చుక్కలు కొబ్బరి నూనె కలిపి మొహానికి ప్యాక్ గా వేసుకోవాలి. పావు గంట తర్వాత చల్లని నీళ్ళతో కడిగేస్తే ఆశ్చర్యపోయే ఫలితం కనిపిస్తుంది. వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకోవాలి.

Leave a comment