టమోటో తో స్క్రబ్బింగ్ క్లీనింగ్ ఫేస్ ప్యాక్ లు చేసుకోవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్. టమోటో తో ఉండే విటమిన్-ఎ ,యాంటీ ఆక్సిడెంట్ల తో పాటు విటమిన్ సి కూడా ఉండటం తో ముఖంపై మొటిమలు రావు. క్లీనింగ్ కోసం టమాటో ప్యూరీ పెరుగు, పసుపు, శెనగపిండి, గంధం పొడి కలిపి పేస్టులా చేసి రాసుకుని పది నిమిషాలు అలా ఉంచి కడిగేసుకోవచ్చు. ఈ మిశ్రమం టాన్  పోగొడుతోంది. స్క్రబ్బింగ్ కోసం బియ్యంపిండి టమోటో ప్యూరీ, పచ్చిపాలు, చిటికెడు పసుపు కలిపి పేస్ట్ లా చేసి మొహం పై రాసి మసాజ్ చేస్తున్నట్లు ఐదు పది నిమిషాలు నెమ్మదిగా రుద్దాలి ఫేస్ ప్యాక్ కోసం టమాటో ప్యూరీ లో గంధం పొడి పెరుగు గానీ, పాలు కానీ కలిపి ప్యాక్ వేసుకోవచ్చు. ఈ టమాటో మాస్క్ మొహాన్ని మెరిపిస్తుంది. చర్మం బిగుతుగా అయిపోతుంది.

Leave a comment