మనం ఆహారంగా తీసుకునే ఎన్నో కూరగాయలు పండ్లలో చర్మానికి అందం మిచ్చే ఎన్నో సుగుణాలున్నాయి. కీర రసం చర్మానికి కావలసిన తేమను అందించి మృదువుగా తాజాగా ఉంచుతుంది. అరటిపండు గుజ్జు తో ప్యాక్ వేసుకుంటే ముఖం, మెడ దగ్గర చర్మం బిగుతుగా మారుతుంది. సాగిన చర్మం పైన పెరుగుతో మాస్క్ వేసుకుంటే చర్మం బిగుతుగా అవుతుంది. మెరుపుతో ఉంటుంది. బాదం నూనెలో విటమిన్ ఇ చర్మానికి కావలసిన తేమను అందిస్తుంది. అవకాడో కూడా చర్మం సాగిపోకుండా చూస్తుంది. బొప్పాయి లోని ఎంజైమ్ చర్మంలోని సాగే గుణాన్ని నియంత్రిస్తాయి.

Leave a comment