డాండ్రఫ్ తో సతమతం అవుతున్నారా.. ?? మరేం పరవాలేదు ఇక్కడ తెలిపిన ఇంట్లోనే ఉండే ఔషదాల ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. బయట దొరికే కృత్రిమ ఉత్పత్తుల కన్నా.. ఇవి మంచి ఫలితాలను ఇస్తాయి. మీ జుట్టు నుంచి పొడిగా చర్మం విడుదల అయితే దానిని చుండ్రుగా పరిగణించవచ్చు. ఇలా చుండ్రు వచ్చినప్పుడు మీకు దురదగా కూడా ఉంటుంది. మీ బజారులో దొరికే ఏ ఉత్పత్తితో అయినా మీ చుండ్రుని పూర్తిగా నివారించడం కష్టం. పైగా ఆ ఉత్పత్తులు ఖర్చుతో కూడుకున్నవి. అలా కాకుండా మీరు అతి తక్కువ ఖర్చుతో, సహజంగా మీ ఇంట్లోనే చుండ్రుని పరిపూర్ణంగా నివారించవచ్చు. నిమ్మ రసంలో ఉండే ఉపయోగకరమైన పదార్థాలు వెంట్రుకలను చైతన్యవంతంగా చేసి చుండ్రుని తొలగిస్తుంది. కేవలం మీరు రాత్రి పడుకునే ముందు నిమ్మ రసంతో మీ జుట్టుని మర్దన చేస్తే సరిపోతుంది. ఉదయం లేచాక మీ జుట్టుని చల్లని నీటితో కడగాలి. మీరు ఒక వంతు నిమ్మ రసంతో పాటు రెండు వంతుల కొబ్బరి నూనెతో కూడా మర్దన చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇలా మర్దన చేయడం వలన మీ చుండ్రుని నివారించవచ్చు.

ఒక చిటికెడు కర్పూరంని కొబ్బరి నూనెతో లేక వేప నూనెతో సగం కప్పు నింపబడిన దానిలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తల మీద మర్దన చేసి ఒక రాత్రంతా ఉంచాలి. ఉదయం లేచాక నీటితో కడగాలి. మరియు ఒక చిటికెడు ఆముదము, ఆవ నూనె మరియు కొబ్బరి నూనె కలిపి మర్దన చేసి ఒక రాత్రంతా ఉంచాలి. ఉదయం వెచ్చటి నీటితో కడిగితే చుండ్రుని నివారించవచ్చు. ఉసిరి నూనె తో మీ తల పై మర్దన చేయాలి. తరువాత కొద్దిగా తడితో ఉన్న టవల్ ని మీ తల చుట్టూ కట్టి ఒక అరగంట పాటు ఉంచాలి. ఆ తరువాత ఒక మోస్తరు నీటితో కదిగినట్లయితే మీకు చుండ్రు నుంచి ఉపశమనం కలుగుతుంది.

Leave a comment