జెడ్ ప్లస్ మూవీ ఇప్పుడు ప్రైమ్ లో ఉంది. అరిల్ హుసేన్ ఈ సినిమాలో టైర్లకు పంక్చర్లు వేసే పనివాడుగా నటించాడు. పి .ఎం అనుకోకుండా  ఆ పల్లెటూరులో ఉన్న దర్గా దర్శనానికి వస్తాడు . ఆయన కోసం దర్గాలో ప్రార్థనలు చేయించేందుకు  పంక్చర్లువేసే హీరోని పిలుస్తారు . ప్రధాని ప్రార్థన ముగించుకొని నీకేం కావాలన్న ఇస్తాను అంటాడు .  పంక్చర్ల అస్లామ్ తనకు పొరుగింటి వాడితో తగవు ఉందని మీరు పక్కనున్న పాకిస్థాన్ తో ఇబ్బందిపడుతున్నట్లు నేను వాడితో కష్టాలు పడుతున్నానంటాడు . అస్లాంకు ఓ ప్రియురాలు కూడా ఉంటుంది . ఆమె పైన ప్రేమగీతాలు రాస్తుంటడు పక్కింటి వాడు . ఈ పొరుగు వాడి గురించి చెప్తే భాషా సమస్యతో అస్లాంకు పాకిస్థాన్ నుంచి థ్రెడ్ ఉండనుకొందని అతని z కేటగిరీ భద్రత ప్రకటిస్తాడు . ప్రధాని ,మాములు  పంక్చర్లు వేసుకొనే వాడు z కేటగరీ రక్షణ ఏర్పాటు చేస్తే ఎలా వుంటుంది ?మీడియా పుణ్యంతో అతనికివచ్చిన ప్రచారం తో అతనికి రాజకీయాల్లోకో వెళ్లే అవకాశం వస్తే … ఒక అవక తవక గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంటుందో చాలా బాగా చూపించారు ఈ సినిమా లో చుడండి తప్పకుండా .

Leave a comment