ఇది కూడా ఒక రకంగా వ్యవసాయమే.వర్షాకాలంలో వియత్నం లోని మెకాంగ్ నదీ తీర ప్రాంతంలో (Mekong delta) వరద నీళ్లు ముంచెత్తుతాయి పంట పొలాలు కూడా మునిగిపోతాయి.కానీ అక్కడి లాంగ్ ఎన్ ప్రాలిన్స్ లో నివశించే వాళ్ళు ఈ వరదలు అదృష్టం తెచ్చిపెడతాయి.వేగంగా వచ్చే ఆ నీళ్లు తెలుపు గులాబీ రంగు కలువ మొక్కలను గుట్టలుగా తీసుకువస్తాయి.అవి సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు విరవగా పూస్తాయి.రైతులు ఈ కలువ పంటను సేకరించు కొంటారు వియత్నం లో ఈ కలువ పువ్వుల ను అలంకరణ కోసం టీ తయారీకి, వాడతారు వాటి కాడలు ఇష్టంగా తింటారు. రంగురంగుల పూలతో వికసించిన ఈ ప్రాంతం పర్యాటకులకు కనువిందు చేస్తుంది.

Leave a comment