నిజామాబాద్ జిల్లాలో ఉన్న బింగల్ గ్రామంలో గల శ్రీ లింబాద్రి నరసింహస్వామి ప్రసాదం తీసుకొని వద్దాం పదండి.

ఇక్కడ స్వామి వారు గుట్ట పైన గుహలో మనకు దర్శనం ఇస్తారు.ఒక రైతు తన నాగలికి స్వామి వారి విగ్రహం తగలగా అటు వైపు నుంచి ఒక పాము గుహలోకి దారి చూపుతూ అదృశ్యం అయ్యింది.వెంటనే రైతు స్వామి వారి విగ్రహాన్ని ఆ గుహలో ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహించాడు.దుండగులు స్వామి వారి ఆభరణాలు దొంగిలించే ప్రయత్నం స్వామి ఉన్న గుహని ఇరుకుగా చేసిన వారు భయపడి పారిపోయారు.అంత మహిమ గల స్వామి.మనకు ఉగ్రరూపంలో కనిపించే స్వామి ఇక్కడ తొడ పైన లక్ష్మీదేవి కూర్చోబెట్టుకుని భక్తుల కొరకు కొలువు తీరి ఉన్నారు.కన్నుల పండుగగా స్వామి వారి సన్నిధిలో పూజలు చేసి ముక్తి పొందుతారు భక్తులు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పులిహోర, పొంగలి

-తోలేటి వెంకట శిరీష

Leave a comment