ఫేస్ రీడింగ్ లాగే లిప్ రీడింగ్ కూడా ఉందని చైనీయుల సిద్దాంతం . ముఖంలో భావాలు ప్రకటించటంతో పెదవులు కూడా ముఖ్యమే . పెదవులు చూసి గుణగణాలు అంచనా వేయచ్చు అంటారు చైనీయులు . ఒక్కోళ్ళ పెదవులు చక్కగా ఉంటాయి . హృదయాకారంలో పెదవులు ఉంటే కొత్త ఆలోచనలు చేస్తారట . బొద్దుగా ఉన్న పెదవులు ఉంటే ధైర్యవంతులు .వెడల్పు పెదవులు వాళ్ళు తెలివైన వాళ్ళు సన్నని పెదవులుంటే ఇండిపెండెంట్ గా ఉండాలనుకొంటారు . గుండ్రని పెదవులు వాళ్ళు ఆత్మవిశ్వాసం తో అసాధారణ లక్ష్యాలు చేపట్టిందుకు ఇష్టపడతారు . మధ్యలో బొద్దుగా ఉంటే ప్రతి పనిలో విజయం సాధిస్తూ ఫెమస్ అవుతారు . పెదవులు ఎలాంటివో తెలుసుకోవాలంటే లిప్ స్టిక్ వేసుకొని తెల్ల కాగితం పైన నొక్కి పెడితే పెదవుల ఆకారం ముద్ర పడుతుంది .

Leave a comment