ఇది నాకు క్రేజీగా అనిపిస్తోంది. ప్రస్తుతం దేశం చెప్పిన వాయిస్ ఓవర్ అందరు వింటారని ఊహించలేదు అంటోంది ఢిల్లీకి చెందిన వాయిస్ ఓవర్ ఆర్టిస్ జస్లీన్ భల్లా. ఇప్పుడు ఫోన్ ఎత్తితే చాలు ‘కరోనా వైరస్ యా కోవిడ్ 19 సే ఆజ్ పురాణాదేశ్ లడ్ రహా హై ‘ అంటూ ముందుగా సందేశం వస్తుంది. ఈ గొంతు జస్లీన్ దే. ఢిల్లీ యూనివర్సిటీ కి చెందిన  ఖల్సా కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్‌ అయిందామె  వివిధ ఛానళ్లకు స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కూడా. కేంద్ర ప్రభుత్వం కుటుంబ సంక్షేమ శాఖ కోరటంతో ఈ ప్రకటన ను జస్లీన్ 30 సెకండ్లలు చదివింది. నా గొంతు నాకే వినిపించటం చాలా గమ్మత్తుగా ఉంది. అంటోంది జస్లీన్ భల్లా.

Leave a comment