కన్నడం లో కరాళ రాత్రి టైటిల్ తో హిట్ అయిన సినిమా తెలుగులో కన్నడ దర్శకుడు దయాల్ పద్మనాభన్ తీశారు. చేసిన అప్పులు తీర్చలేక, తమ పొలాన్ని అప్పిచ్చిన వారికే కుదువబెట్టి ఆ పొలంలో పని చేస్తుంటారు ఒక దంపతులు వాళ్లకో అమ్మాయి మల్లి. ఈ అప్పుల నుంచి బయట పడే మార్గం లేక దరిద్రం తో కుంగిపోతూ పెళ్ళి లేకుండా జీవితం గడప వలసిందే నా అని దిగులు పడుతూ ఉంటుంది మల్లి. ఓ రోజు రాత్రి వాళ్ళింటికి శ్రీనివాస్ అనే  దేశదిమ్మరి గెస్ట్ గా వస్తాడు.అతని దగ్గరున్న డబ్బు నగలు చూసిన ఆ కుటుంబం అతన్ని హత్య చేసి ఆ సంపద కాజేయాలని నిర్ణయించుకుంటారు. చంపేస్తారు కూడా ? చంపేశాక ఆ వచ్చిన అతిధి ఎవరు, ఎందుకు వచ్చాడు  తెలుస్తుంది. సంపద కంటే విలువైన ఆ వ్యక్తిని పోగొట్టుకొన్న కుటుంబం ఆ రాత్రి మంటల్లో దహనమైపోతుంది ఇదీ క్లుప్తంగా కథ. తెలుగులో తీసిన కన్నడ సినిమా లాగే ఉంది.ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది.

రవిచంద్ర.సి    
7093440630   

Leave a comment