కినారా క్యాపిటల్‌’ యాప్‌ 2.5 లక్షల మందికి ఉపాధి చూపెట్టింది హార్దికాషా. వారికి అందిన రుణాల మొత్తం రూ.700 కోట్లు. మధ్యతరగతి గుజరాతీ అమ్మాయి హార్దిక. చిన్న వ్యాపారం చేసేందుకు రుణం కోసం తల్లి చేసిన ప్రయత్నం మనసులో నింపుకొని పెద్దయ్యాక ‘హెర్‌ వికాస్‌’ పేరుతో రాయితీతో రుణాలు ఇచ్చే యాప్ సృష్టించింది.ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌ ఆధారంగా పనిచేసే ఈ యాప్‌ అతి సులభంగా ఒక్క రోజులోనే రుణం అందేలా చేస్తుంది. ప్రత్యేకంగా మహిళలకే 75 కోట్ల రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి బాట పట్టేలా చేసింది హార్దికాషా. కొలంబియా బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ చదివి, కొన్నాళ్లు స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని సామాజిక వ్యాపార నిర్వహణ బాధ్యతలు తీసుకుంది హార్దిక.

Leave a comment