క్యాలెండర్ వయసు ,శరీరరక వయసు ఒకేలా ఉండవు అంటారు అద్యాయనకారులు. 1972-73 సంవత్సరాల్లో పుట్టిన 100మంది పై తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో కొందరి కాలెండర్ వయసు 38ఏళ్ళుగా ఉన్నట్లు ,లోపల వయసు కొందరిలో 30గానూ ఉన్నట్లు మరికోందరికి 60 గానూ ఉన్నట్లు కనిపెట్టారు. కొందరికీ శరీర అంగాలు చాలా త్వరగా వార్థక్యా లక్షణాలు సంతరించుకుంటాయి. రక్త స్థితి గుండె ఆరోగ్యం కంటి చూపు ,దంత ఆరోగ్యం మొదలైన విషయాలను బట్టి లోపల వయసు అంచన వేశారు. లోపలి వయసు ఎక్కువగా ఉంటే కీళ్ళ అరుగుదల కంటి చూపు సమస్యలు త్వరగా వచ్చాయి. అయిటే అనారోగ్య అంశాల్లో ఇరవై శాతం మాత్రమే వంశ పారంపార్యంగా వస్తాయని మిగిలిన 80శాతం మార్పులు అలవాట్లు ,పరిసరాల వాతావరణం వాడిన మందుల వంటి వాటిపైన ఆధారపడి ఉంటాయని తేలింది.అనారోగ్యకరమైన అలవాట్లే లోపలి వయసుని ఎక్కువ చేస్తాయని అధ్యయనకారులు చెపుతున్నారు.

Leave a comment