అవతార పురుషుడైన రాముడిని మానవమాత్రుడి గా చిత్రించి మానవ సమాజం అనుసరించవలసిన ఆదర్శాలను ఆయా పాత్రల ద్వారా చెప్పించారు వాల్మీకి.సమాజంలో ఎవరు ఎలా మెలగాలో సూచించారు సత్యం ధర్మం ఈ ప్రపంచానికి రెండు కళ్లు అని సత్య సంధతే ధర్మాన్ని రక్షిస్తుందని రాముని పాత్ర ద్వారా లోకానికి చాటారు వాల్మీకి.రాముడు కథానాయకుడిగా ఉన్నారు రామాయణం లో వివాహ బంధం, కుటుంబ బంధం, పాలన విధానాలు, రాజు ఆచరించవలసిన నియమాలు అన్నింటినీ పాత్రల ద్వారా చెప్పించారు.పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో రాముడు గొప్ప ఆదర్శం ఈ ప్రపంచంలో ప్రతిచోటా సీతారాముల పాదస్పర్శను అనుభవంలోకి తెచ్చుకొన్నారు భక్తులు రామ కథ అజరామరం రాముడు ఎప్పటికీ ఆదర్శవంతుడే.

చేబ్రోలు శ్యామసుందర్ 
9849524134

Leave a comment