బరువు తగ్గేలా జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువవుతాయి అంటున్నారు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు.జీవనశైలిలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు బాడీ మాస్ ఇండెక్స్ (బి ఎం ఐ) ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉన్నవాళ్లలో మధుమేహం పెరిగే అవకాశం ఎక్కువ.దీర్ఘకాలం అధిక బరువు ఉండే వాళ్లలో ఈ సమస్య మరీ ఎక్కువ.జన్యువుల కన్నా (అంటే వంశపారంపర్యంగా మధుమేహం ఉన్న కుటుంబంలో కన్నా)బరువు ఎక్కువగా ఉండే వాళ్లే మధుమేహానికి గురవుతున్నారట కనుక అనువంశికంగా మధుమేహం వచ్చే అవకాశం ఉంటే మటుకు ఎప్పటికప్పుడు బరువునీ మధుమేహాన్ని పరిశీలించుకోవాలి.తొలిదశలో గుర్తించి బరువు తగ్గితే ఆరోగ్యం గా ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు.

Leave a comment