ముంబాయిలో లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ 2016 కార్యక్రమంలో లక్స్ తన మోడలింగ్ తారలను అవార్డులతో సత్కరించింది. నాటి తార షర్మిలా టాగోర్ కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, కరీనాకపూర్ కు గ్లామర్ దివా అవార్డు, దీపికా కు ఐకానిక్ లుక్ అవార్డు ఇచ్చారు. పూజా హిగైకు బెస్ట్ డెబ్యు అవార్డు బహుకరించారు. లక్స్ మొట్టమొదట 1899 లో బ్రిటన్ లో ఒక లాండరీ షాప్ గా మొదలైంది. లక్స్ బ్రాండ్ ప్రచారంలో బ్లాక్ అండ్ వైట్ నాటి హీరోయిన్ సురయ్య దగ్గరనుంచి షర్మిల, హేమామాలిని నందా సాదన్, సైరా భాను, జయ ప్రాధ, శ్రీదేవి, ఐశ్వర్యా రాయ్ వంటి స్టార్ డమ్ వున్న హీరోయిన్లందరూ మోడల్ గా కనిపించరు.

Leave a comment