నేను ఉపాధి వెతుక్కోవటం కాదు, వ్యాపార రంగంలో దిగి, సక్సెస్ అయి, నలుగురికీ ఉపాధి చూపించాలనుకొన్నాను అంటుంది 26 ఏళ్ల తుక్తుకి దాస్ నవంబర్ 2021 హబ్రా రైల్వే స్టేషన్ లో కొంతమంది మిత్రుల మధ్య ఎం.ఎ ఇంగ్లీష్ చాయ్ వాలీ దుకాణం తెరిచింది. తుక్తుకి దాస్. 2020 లో రవీంద్ర భారతి యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. పేరు కొత్తగా ఉండటం, తన రోజు వారీ  అనుభవాలు వీడియో తీసి బ్లాగ్ లో ఉంచటం వల్ల ఆ టీ షాప్ చాలా తొందరగా పాపులర్ అయ్యింది. ఈ బ్రాండ్ తోకోల్‌కతా లో ఇంకొన్ని దుకాణాలు తెరుస్తాను అంటుంది తుక్తుకి దాస్.

Leave a comment