‘సరిగమపా’ పాటల పోటీలో చక్కగా పాడినందుకు మెచ్చుకొని నీకేం కావాలి అని అడిగితే, మా ఊరికి బస్సు కావాలి అని అడిగింది కర్నూలు జిల్లాకు చెందిన దాసరి లక్ష్మీపార్వతి. ఎలాంటి సంగీత నేపథ్యము లేని వ్యవసాయ కుటుంబం మాది కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం లక్ష్మి లక్కసాగరం గ్రామం తిరుపతి శ్రీ వెంకటేశ్వర నిత్య సంగీత కళాశాలలో శిక్షణ తీసుకున్నాను. ఒక ఛానల్ వారు నిర్వహించిన సరిగమప ప్రోగ్రాం లో న్యాయ విధేయతలు నిర్ణేతలు చక్కగా పాడావు నీకేం కావాలో చెప్పు అని అడిగితే మా ఊరికి బస్సు సౌకర్యం కావాలి అని అడిగాను. మా ఊరి నుంచి తిరుపతి వెళ్లాలన్నా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న డోన్ బస్టాండ్ వరకు వెళ్ళాలి మా ఊళ్లో పిల్లల పై చదువుల కోసం, అంటే హైస్కూలు చదువు చదవాలన్న కధారి కోటలో కంచాల పాడు కు వెళ్ళాలి అందుకే బస్సు కావాలని కోరుకొన్నాను ఈ బస్సు మా ఊరి తో పాటు చుట్టుపక్కల గ్రామాల వారికి సౌకర్యంగా ఉంటుంది అంటుంది యువ గాయని దాసరి లక్ష్మీపార్వతి.

Leave a comment