ఈ కొత్త పరిశీలనని, సలహాని శ్రద్దగా అర్ధం చేసుకోవాలి. రోజులో ఏడు ఎనిమిది గంటలు పని చేస్తాం. పూర్తిగా ఏకాగ్రతతో పని చేయడానికి మనస్సులో నిశబ్దన్ని పెంచుకోవాలట. అంటే నిశ్శబ్దం అంటే ఏకాగ్రత. ఆ ఏకాగ్రత కోసం గంటకోసారైనావ్యక్తి నిశ్శబ్దం పాటించాలి. ఒక్క చపుడు కూడా చెవిన పడకుండా, ఏమీ ఆలోచించకుండా కేవలం పదే పది నిముషాలు మనస్సులో, బయటా మౌనం పాటించగలిగితే పని సమాధ్యం పెరుగుతుందని కొత్త రిపోర్ట్ చెపుతుంది. నిశ్శబ్దం ఎలా దొరుకుతుంది. ఎవ్వరు లేని ఏకాంతంలో కానీ అందరి మధ్య, ఉద్యోగం చేసే ప్రదేశంలో ఎలా? ఎక్కడ? సరైన సంగిఇతం వినాలి. కేవలం అది సౌండ్ పెరిగి ఇతరులను ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు. మనలోకి మనం వుండే సమయం కోసం ఇయర్ ఫోన్స్ లో వినాలి. ఆ సంగీతంనెమ్మదిగా రెండు నిమిషాల్లో ఆ శబ్దం ఇంకొకటి వినిపించని స్తితికి తీసుకుపోతుంది. దాన్ని ప్రాక్టీస్ చేయాలి. సంగీతం అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటున్నారు పరిశోధకులు. ఈ ఏకాంత స్థితి మనస్సుని స్వాంత పరచి, వత్తిడి, తగ్గించి, పని భారాన్ని తీసేసి తేటగా తాయారు చేస్తుంది. అప్పుడు మళ్ళి కొత్త శక్తి తో పని చేయ గలుగుతాం. పోనీ దీన్ని ప్రాక్టీస్ చేస్తే అలవారుచోకోవచ్చు ఏమో ప్రయత్నించవచ్చు కదా?

Leave a comment