నుదిటిపైనా పెట్టుకొనే బొట్టు బిళ్ళ మచ్చ పడుతూ ఉంటుంది. నాణ్యత లేని బొట్టు బిళ్ళ లో,మెనో బైంజైల్ ఈస్టర్స్ ఆఫ్ హైడ్రో క్యూనోస్ అనే పదార్థం ఉంటుంది దీని వల్లనే బొట్టు బిళ్ళ అతికించుకొనే చోట మచ్చ పడుతుంది. మంచి క్వాలిటీ బోట్టు బిళ్ళ వాడాలి ఇప్పటికే మచ్చ పడి వుంటే సొంత వైద్యం వద్దు చర్మ వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి పర్మనెంట్ మేకప్ ద్వారా కూడా ఈ మచ్చ కనబడకుండా చేయచ్చు. మచ్చ ఉన్న ప్రదేశంలో కలర్ టెస్ట్ చేయించి అప్పుడు పర్మనెంట్ కలర్ వేయిస్తే మచ్చ కనబడకుండా పోతుంది. ఇది వైద్యుల పర్యవేక్షణ లోనే చేయించుకోవాలి.

Leave a comment