మొటిమలు తగ్గి పోయిన వాటి తాలూకు మచ్చలు చర్మం పైన కనిపిస్తూ ఉంటాయి. చిన్నపాటి మేకప్ చిట్కాలతో ఈ మచ్చలు కనిపించకుండా చేయచ్చు. స్కిన్ కు మేకప్ కు మధ్య పొరల పనిచేసే ప్రైమర్ చర్మరంధ్రాలు మచ్చలు దాచేస్తుంది చర్మం జిడ్డుగా కనిపించనీయదు అలాగే నారింజ కలర్ కరెక్టర్ ను ఉపయోగించి చర్మం లో కలిసిపోయేలా బ్లెండ్ చేసుకుంటే పాత మొటిమల మచ్చలు కొత్త మొటిమల ఆనవాళ్లు కనిపించాయి. స్కిన్ టోన్ కు దగ్గరగా ఉండే కన్ సీలర్ తో మచ్చలను చర్మం లో కలిసిపోయేలా బ్లెండ్ చేయాలి. తరువాత మాటి ఫౌండేషన్ ముఖమంతా రుద్ది స్పాంజ్ తో మొహం మొత్తం పరుచుకొనేలా చేయాలి మేకప్ చెక్కుచెదరకుండా చివర లో పౌడర్ అద్దుకోవాలి .

Leave a comment