Categories
అమ్మాయిలకు మొటిమలు పెద్ద సమస్య. ముఖ్యంగా ఇవి మచ్చలు పడితే ఒక పట్టాన పోవు. మందుల కంటే వంటింటి చిట్కాలే బాగా పని చేస్తాయి. నిమ్మరసం,రోజ్ వాటర్,శనగ పిండి కలిపి పెస్టుల చేసి మొహానికి అప్లై చేసి ఆరాక కడిగేస్తే నెమ్మదిగా మచ్చలు పోతాయి. ఆపిల్ సిడర్ వెనిగర్ లో తేనె,నీళ్ళు కలిపి మొహానికి పట్టించి ఓ అరగంట తర్వాత కడిగేసిన మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనె బాగా పని చేస్తుంది. కమలా తొక్కలు పొడి చేసి అందులో తేనె కలిపి మొహానికి పట్టించి అరగంట ఆగి కదిగేయాలి. ఇలా కొన్నాళ్ళ పాటు చేస్తే మొహం మీద మచ్చలు మాయం అవుతాయి. మొహం కుడా మెరుస్తూ కనిపిస్తుంది.