నలభై ఏళ్ళు దాటాక మేకప్ విషయం లో కొన్ని మార్పులు తీసుకోవాలంటున్నారు ఎక్సపర్ట్స్. చిన్నప్పుడు ఎలాంటి మేకప్ అయినా సరే అప్పుడు గొప్ప సెలబ్రేషన్. 40 ఏళ్ళు దాటితే ముందు కళ్ళ కింద నల్లని వలయాలు వస్తాయి. ఆలా కనిపించకుండా మేకప్ లో క్లీన్సర్ ని ఒకటికి రెండు సార్లు వేస్తె నల్లని వలయాలు కనబడకుండా చేయచ్చు. కొన్ని రకాల ఐషాడోలు అంటే గ్రే ముదురు రంగులో కళ్ళని అలసి పోయినట్టు కనబడేలా చేస్తాయి. లేత రంగులు బావుంటాయి. ఐషాడో లైనర్ వంటివి వాడటం ఇష్టంలేకపోతే కనీసం ప్రైమర్ అయినా రాసుకోవాలి. కళ్ళు చక్కగా వుంటాయి. మస్కారా ఎంత తక్కువ వుంటే అంత బావుంటుంది. పైన ఉండే  కనురెప్పలకే మస్కారా వేయాలి. ముఖం లోని మడతలు దాచి పెట్టేందుకు షమ్మర్ వాడుతుంటారు. దాని వల్లనే ప్రమాదం మడతలు స్పష్టంగా కనిపిస్తాయి. బదులుగా మ్యాటీ  ఫెథర్స్ వాడితే అలంకరణ సహజంగా కనిపిస్తుంది. అలాగే జుట్టు గట్టిగా దువ్వి పోనీ  లా కూడా  మానేయాలి. బిగువుగా లాగి కడుతుంటే నడి నెత్తి మీద జుట్టు కుదుళ్ళు వదులై జుట్టు రాలిపోతుంది. 40 గంట కొట్టగానే కొన్ని మార్పులు చేసుకుంటే వయసుని అక్కడే ఫ్రీజ్ చేయచ్చు.

Leave a comment