Categories
ప్రీతీ షీల్ సింగ్ మేకప్ స్టయిలిస్ట్. బాజీరావ్ మస్తానీ , మామ్ వంటి సినిమాలకు పని చేసిన ప్రీతీ పద్మావతి సినిమాలో తన ప్రేత్యేకత నిరూపించుకుంది. లాస్ ఏంజెల్స్ , లండన్ లో మేకప్ కోర్స్ పూర్తి చేసిన ప్రీతి క్యారెక్టర్ డిజైన్ , ప్రొస్థెటిక్ కోర్స్ లు చేసింది. ప్రొస్థెటిక్ అంటే భయపెట్టే మేకప్ , గాయపడిన , అచ్చంగా గాయాలతో ఉన్నట్లు మేకప్ చేయడం. ఆమె ప్రత్యేకత పద్మావతి లో క్లైమాక్స్ సీన్స్ లో యుద్ధం సీన్ లో గాయాల తో నిండిన క్షతగాత్రులను చూపించడం అంత తేలికగా పూర్తి కాలేదు అంటుంది. శ్రీదేవి నటించిన మామ్ చిత్రం లో నేను చేసిన ప్రొస్థెటిక్ మేకప్ నాకెంతో సంతృప్తిని ఇచ్చింది అంటుంది ప్రీతీ షీల్ సింగ్.