పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఎక్కువగా వుండే సీజన్ ఇదే. అంతు లేని వేడి కళ్ళ కింద వలయాలు అలసట సృష్టిస్తూ వుంటుంది. ఏదైనా మేకప్ తో ఈ వలయాలని దాచేయటం చాలా కష్టం. కన్సీలర్ తో ముఖం పైన ముడతలు, మచ్చలు, చర్మం సాగి పోవడం కవర్ చేయడం కష్ట కష్టమే యవ్వనపు ఛాయలు పరిరక్షించుకోవడం కోసం నల్లని వలయాలు కనబడనీయకుండా చేసేందుకు చర్మం కోసం డిజైన్ చేసిన మాయిశ్చురైజర్ ఎంపిక చేసుకోవాలి. కన్సీలర్ అప్లయ్ చేసే ముందర చర్మానికి తగిన తేమ చాలా ముఖ్యం. దీని వల్ల చర్మం మచ్చలు లేకుండా వుంటుంది. వాడె ఫౌండేషన్ కు ఒకటి రెండు లైటర్ షేడ్స్ గల కన్సీలర్ వాడాలి. దీని వల్ల కళ్ళ కింద నలుపు పల్చబడి పోతుంది. క్రీమీ ఫార్ములా చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. కొంచం ఆరాక షీర్ లూజ్ పౌడర్ అప్లయ్ చేసే మచ్చలు ముడతలు కనబడకుండా పోతాయి.

Leave a comment