ప్రకృతి ఇచ్చిన ఎన్నో పదార్థాలతో ముఖ సౌందర్యాన్ని పెంచే ఔషధ గుణాలున్నాయి. బాదం గింజలు నీళ్ళలో నాననిచ్చి పై పొట్టు తీసి మెత్తగా పేస్టులా చేసి ముఖంపై మాస్క్ వేసి ఆరిపోయాక కడిగేస్తే ముడతలు రావు.గుప్పెడు మెంతి ఆకులు మెత్తగా చేసిన గుజ్జు ముఖానికి కాంతినిచ్చే విలువైన మాస్క్.అలాగే కలబంద గుజ్జు ముడతలు రానివ్వదు.విటమిన్ ఎ పుష్కలంగా ఉండే క్యారెట్ కొలాజెన్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది.క్యారెట్ ని ఉడికించి మెత్తగా పేస్ట్ చేసి అందులో తేనె కలిపి మాస్క్ వేసుకుంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది.మృతకణాలు పోయి ముఖం బిగుతుగా అయిపోతుంది.

Leave a comment