Categories
స్టవ్ పైన పాలో, టీ నో పెట్టి మర్చిపోతే అవి కాస్త మరిగి పోయి గిన్నె కూడా మాడిపోతుంది. ఈ మాడిపోయిన గిన్నెను యధా రూపం లోకి తెచ్చేయవచ్చు .మాడిన గిన్నె లో సగానికి నీరు పోసి రెండు స్పూన్ల వంటసోడా రెండు నిమ్మకాయల రసం వేసి ఈ గిన్నెలో నీళ్ళు మరిగించాలి.నీళ్లు మరుగుతున్నప్పుడు స్పూన్ తో తిప్పితే అతుక్కుపోయిన మాడిన పదార్థం ఊడి వస్తుంది .ఇలా నెమ్మదిగా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడే రుద్దేస్తే గిన్నె మాడు దాదాపుగా పోతుంది .