లగ్జరీ హోటల్స్, గగన విహారాలు బెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సెస్, రాంప్ వాక్స్ ఇవే హీరోయిన్ ల గురించి ఒక ఊహా లోకం కానీ ఇవేమీ నా దగ్గర వుండవు అంటుంది సృతిహాసన్ నేను చాలా మాములు అమ్మాయిని నేనెలాంటి బ్రాండ్స్ ఇష్టపడను. ఎక్కడ డిస్కౌంట్ సెల్ కనబడితే అక్కడ వాలిపోతాను మార్కెట్ లోకి వచ్చిన ప్రతి కొత్త దుస్తులు వేసుకోవడం నాకు నచ్చదు. నాకు సలహాలు కుడా వస్తాయి. అన్నీ వింటాను కానీ నాకు వీలైతే సరిపడతాయో అవే కనుక్కుంటా. నేను ఫ్యాషన్ ట్రెండ్ ని ఫాలో అవను. నా ఇష్టాన్ని ఫాలో అవుతా… అదృష్టం కొద్దీ నా ఫ్యాన్స్ నన్ను ఇష్టపడతారు అంటుంది శృతి. లోకనాయకుడి కూతురు ఇంకోలా ఎందుకు ఆలోచిస్తుంది. అచ్చం మధ్య తరగతులు వాళ్ళ లాగే డిస్కౌంట్ లో కొనర్లు, ఫ్రీ ఆఫర్లు నన్ను కుడా ఇంప్రెస్ చేస్తాయి అంటుంది శృతి.
Categories