చిన్న ఇల్లయిన చక్కగా సర్దుకోవాలి. ఎప్పటికప్పుడు వాడిన వస్తువులు ఒక పక్కకు పెట్టేసి ఇల్లు స్పేషియస్‌ గా ఉండేలా చూసుకోవాలి. ఈ ఆలోచనలకు తగ్గట్లే మార్కెట్లోకి ఎన్నో వస్తువులు వస్తున్నాయి. డైనింగ్ టేబుల్ పైన వేడిగా అప్పుడే వండిన గిన్నెలు పెడితే ఆ వేడికి డెకోలం దెబ్బతింటుంది. గిన్నెల కింద ట్రివెట్ వేస్తారు. వాటిని అలా టేబుల్ మీద వదిలేయకుండా ఫోల్డబుల్ ట్రివేట్ లు మార్కెట్లోకి వచ్చాయి. నాలుగు ప్లాస్టిక్ కర్రల లాంటి ఈట్రివెట్ పైన వేడి వేడి గిన్నెలు పెట్టుకున్న పాడవ్వవు. అవసరమయ్యక వీటిని చక్కగా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేయవచ్చు. ఆన్ లైన్ లో ఆర్డరిచ్చే ముందర ఒక్కసారి ఇమేజెస్ చూస్తే సరిపోతుంది.

Leave a comment