Categories
డ్రాయింగ్ రూమ్ లో ఫ్రెష్ లుక్ కావాలంటే అచ్చంగా నిజమైన పూవులను పెడితే సరిపోతుంది. ఒక్కసారి అతిధులు వస్తే ఇల్లంతా ఇలాటి చక్కని పూవులతో నిండిన ఫ్లవర్ వాజ్ లు పెడితే బావుంటుంది అనిపిస్తుంది. ఆతరువాత అవన్నీ అడ్డంగా ఉంటాయి. అలాంటప్పుడు ఫోల్డ బుల్ వాజెస్ కొని తెచ్చుకుంటే వాటితో కావాలనుకొంటే నీళ్ళు పోసి కొమ్మలు రెమ్మలతో అలంకరించవచ్చు లేదా మడిచి పక్కన పెట్టవచ్చు . ఇవి చూస్తే అచ్చమైన ఫ్లవర్ వాజ్ ల్లాగే ఉంటాయి. మందమైన పాలిథిన్ తో తయారు చేస్తారు కనుక ట్రాన్సపరెంటింగా చక్కని బొమ్మలతో అందంగా వుంటాయి. వీటిని ఏ పార్టీకోసమో అలంకారంగా పెట్టక,తీసి మడచి జాగ్రత్త చేయచ్చు.