శిరోజాలకి సంబందించిన సమస్యలు అనేకం. కొందరి జుట్టు పొడవుగా వుంటుంది కానీ పాపిట దగ్గర పలుచగా వుంటుంది. మాడు పైన జుట్టు అణిగినట్లుంటుంది. ఇలా వుంటే ఏ స్టైల్ కూడా సరిగ్గా నప్పదు. సాధారణంగా జుట్టును నుదుటి పై నుంచి వెనక్కి లాగినట్లు దువ్వుతాం కనుక స్ట్రెచ్ చేసే చోట పలుచ పడిపోతుంది. పైగా పాపిట తీస్తాం కనుక సమస్య మరింత ఎక్కువగా వుంటుంది. పాపిట  పొడుగైన జుట్టు పలుచగా వున్న చోట ఆముదం అప్లై చేసి మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా రొజూ చేస్తే రెండు నెలల్లో ఫలితం కనిపిస్తుంది. చిన్న చిన్న వెంట్రుకలు పెరగడం మొదలవుతుంది. వారానికి ఒక్క సారి గోరు వెచ్చని కొబ్బరి నూనె మాడంతా అప్లై చేసి మసాజ్ చేయాలి. జుట్టు కుదుళ్ళకు అదనపు లూబ్రికేషన్, పోషకాలు లభిస్తున్నాయి. జుట్టును ముడి వేసుకుంటే కుదుళ్ళను కిందికి లాగ కుండా వుంటుంది. జుట్టు చిక్కులు పడకుండా సమంగా దువ్వుకుంటూ వెటినర్ ఆయిల్ రాసుకుంటే ఇందులో సన్ స్కన్ వుండి జుట్టుకు హాని చేసే కిరణాల నుంచి రక్షిస్తుంది.

Leave a comment