ఎంతోమంది ఆడవాళ్ళ ప్రాబ్లమ్ ఇది. బహుశా ఇందులో స్త్రీ పురుష బేధం ఉండకపోవచ్చు. వర్కవుట్స్ ఆహారం విషయంలో చాలా బోర్ కొట్టేస్తూ వుంటుంది. ఈ ప్రోగ్రామ్స్ కోస్టిక్ అవలేకపోతున్నామంటున్నారు. కానీ అవసరం కదా. నచ్చే యాక్టివిటీ ని ముందుగా ఎంచుకుని ప్రోత్సాహకరంగా ఉండటం కోసం ఫ్రెండ్స్ తో ప్లాన్ చేసుకోవాలి. ముందసలు మొదలంటూ పెట్టాక ఒక యాడాది పాటు స్టిక్ అయివుంటేనే ఫలితం కనిపిస్తుంది. మార్పు కోసం వెరైటీలు ప్రయత్నించటమే కర్తవ్యం. సాధించగల వాస్తవికమైన చిన్న లక్ష్యాలనే పెట్టుకోవాలి. రోజురోజుకీ బరువు తగ్గదు. ఆహారం పోషకాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కావాలి. ఫలితాలు కనిపిస్తూ వుంటే మోటివేషన్ పెరుగుతుంది. ఓర్పు సహనం కావలి. శరీరం మార్పుకు సిద్ధం అవుతున్నప్పుడు సడెన్ గా ఆపేస్తే ప్రయత్నం వృధా అయిపోతుంది.

Leave a comment