ఆవూరి పేరు ఉమోజా. కెన్యాలో ఉంది ఈ కుగ్రామం.  25 సంవత్సరాల క్రితం  1990లో ఈ గ్రామాన్ని కేవలం మహిళల కోసం ఏర్పాటు చేసింది ‘రెబెకా’.  చుట్టు పక్కల గ్రామాల్లోని  గృహహింస,  మగాళ్ల వేధింపులుకు గురైన మహిళలు, కేవలం బాధలో ఉన్న ఆడవాళ్లతో ఏర్పడిందీ గ్రామం.  వీరంతా భర్త వేధింపులు తాళలేక వచ్చేసిన వారు, భర్త చనిపోయిన వారు, అత్యాచారాలకు గురైనవారు, అనాథలు, బలవంతపు పెళ్లిళ్లు వద్దనుకొని పారిపోయి వచ్చినవారు కలిసి ఈ గ్రామానికి రూపురేఖలు తీసుకొచ్చారు. ‘మగవాళ్ళకు నో ఎంట్రీ’ ఈ ట్యాగ్ వల్లనే ఉమోజా ఇప్పుడు పర్యాటకులను ఆకర్షిస్తోంది.  బతుగు దెరువుకోసం రకరకాల ఆభరణాలు తయారు చేస్తారు.  పిల్లలకు పాఠశాల , విహారకార్యకలపాల కోసం  ఇతర గ్రామ అవసరాల కోసం కమ్యూనిటీ సెంటర్ కూడా ఉంది.  ఈ గ్రామానికి రూపకలపన  చేసిన ‘రెబెకా’  కూడా భర్త చేతులో అనే అవమానాలు పడి చివరకు ఒక గ్రామాన్నే నిర్మించింది.

Leave a comment