సాదా చీరె జాకెట్టు ఏదైన సరే మగ్గం వర్క్ చేయిస్తే అద్భుతం అనిపిస్తుంది. వెయ్యి రూపాల చీరె , ఇంకో వెయ్యి ఖర్చుతో పండగ స్పెషల్ అయిపోతుంది. పేరోస్టామ్స్ కుందన్స్ ఎంబ్రాయిడరీ మెటీరియల్ సిల్క్ ట్రెడ్స్ ప్రత్యేకమైన గమ్ ఉపయోగించి శిక్షణ పొందిన మహిళలు అందమైన డిజైన్స్ సృష్టించేస్తారు. చీరెలు ,బ్లౌజులు ,డ్రెస్ లు ఏవైన సరే మగ్గం వర్క్ చేయిస్తే చాలు .జాకెట్లపై కుందన్ వర్క్ చెమ్మలు అద్దాలతో వర్క్ చేస్తే సాదాచీరెపైకి ప్యాషన్ గా అమరిపోతున్నాయి. చక్కని డిజైన్ లు ఎంచుకొంటే మగ్గం వర్క్ తో పట్టు చీరెలు కూడా ప్యాషన్ హంగులు సంతరించుకుంటాయి.

Leave a comment