తెలంగాణా రాష్ట్ర పండుగ గా గుర్తింపు పొందిన మేడారం గిరిజన జాతర ఈ ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వ తేదీ వరకూ జరగనుంది. జనవరి ౩1 న సారలమ్మ గోవింద రాజులు పగిడిద్ద రాజు గద్దె చేరుకుంటారు. ఫిబ్రవరి 1 వ తేదీన చిలుకల గుట్ట నుంచి సమ్మక్క గద్దెకు వస్తుంది. రెండొవ తేదీ న భక్తులు మూక్కులు తీర్చుకుంటే నాలుగవ తేదీన అధికార లాంఛనాల తో అమ్మలిద్దరూ వనప్రేవేశం చేస్తారు. దీనితో మేడారం జాతర ముగుస్తుంది. ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు కోటి మందికి పైగా భక్తులు హాజరవవుతారు.

Leave a comment