అరుణాచల శివ !!అరుణాచల శివ
అరుణాచల శివ !!అరుణ శివోం !!

తమిళులకు ఇప్పుడు కార్తీక మాసం.
కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం రోజున అరుణాచల మహా క్షేత్రంలో “మహాజ్యోతి”ని ఒక ప్రత్యేకమైన రాగి ప్రమిదలో వెలిగించి తరిస్తారు.
ఈ విశేషమైన కార్యక్రమం చూసి మోక్షం పొందడానికి తండోపతండాలుగా భక్తులు వస్తారు.600 మీటర్ల వస్త్రాన్ని వత్తిగా చేసి జ్యోతి నాడార్ల వంశస్తులు రాగి ప్రమిదతో తీసుకొని వస్తారు.2500 కిలోల నెయ్యి భక్తులు సమర్పించుకుంటారు.ఈ మహాదీపం 24 కిలోమీటర్ల దూరం వరకు భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ మహత్తర కార్యక్రమానికి భారతావనిలో ప్రతి ఒక్కరికీ స్వామి వారి ఆశీస్సులు అందుకోవడం విశేషం.

నిత్య ప్రసాదం: కొబ్బరి,నెయ్యి

-తోలేటి వెంకట శిరీష

Leave a comment